Saturday, December 13, 2008

పలనాట బ్రహ్మన్న కలి గీత

పులుపుల వెంకట శివయ్య గారిదే ఇంకొక పద్యం.


వర్ణ ధర్మాలన్న ఉక్కుచట్రము పగిలి
మాల కన్నమదాసు మనసైన సుతుడుగా
వీర వైష్ణవ మొచ్చెరా
పలనాట బ్రహ్మన్న కలి గీతలో


ఎనిమిదొందల సంవత్సరాల క్రితమే కులాంతరాలని రూపు మాప ప్రయత్నించిన ఘనచరిత్ర పలనాటికుంది. కన్నమదాసు పలనాటి వీరులలో ఎన్నదగినవాడు. పలనాటి సైన్యాధ్యక్షుడు. పౌరుషమే పలనాట కులం. వీరత్వమే మతం.

Thursday, February 1, 2007

పలనాడు వెలలేని మాగాణిరా

పులుపుల వెంకట శివయ్య గారి పద్యం ఇది.పలనాటి గురించి ఆయన వ్రాసిన ఈ పద్యం నాకు చాలా బాగా నచ్చింది. ఈ పద్యాన్ని గురజాల లో ఈమధ్య ప్రతిస్టించిన బ్రహ్మనాయని విగ్రహం శిలాఫలకం మీదనుండి సేకరించాను.

వెనుక తరములవారి వీర చరితల సిరుల
నారోసి త్యాగంపు నీర్పెట్టి పెంచెరా
విరిసి సుఖములు పండురా
పలనాడు వెలలేని మాగాణిరా